రేవంత్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 97 కొత్త 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను' (TPS) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కోర్ అర్బన్ రీజియన్ వెలుపల ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇవి అందుబాటులోకి రానున్నాయి. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో ఇంగ్లీష్ మీడియంలో, సెమీ రెసిడెన్షియల్ విధానంలో విద్యను అందించడమే ఈ స్కూళ్ల లక్ష్యం. ఉచిత బస్సు సౌకర్యం, పౌష్టికాహారం, అధునాతన మౌలిక సదుపాయాలతో ఒక్కో పాఠశాలను సుమారు రూ.10 కోట్ల వ్యయంతో తీర్చిదిద్దుతున్నారు.