తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఈ జిల్లాల్లో వానలు

3 months ago 21
తెలంగాణలో రానున్న ఆరు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కర్ణాటక నుండి తమిళనాడు వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఏప్రిల్ 3 వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడవచ్చునని చెప్పింది. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, వడగళ్ల వానలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో రాష్ట్రంలో ఎండలు కూడా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Read Entire Article