తెలంగాణకు మరో 7 నవోదయ విద్యాలయాలు.. ఈ జిల్లాల్లోనే..

11 months ago 28
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా 7 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. 2024 డిసెంబర్‌లో ఆమోదం పొందినా.. నేడు అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇవి భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్‌నగర్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో స్థాపితమవుతాయి. దీంతో రాష్ట్రంలో JNVల సంఖ్య 16కు చేరుతుంది. 2024-29 మధ్య రూ.2,359 కోట్లు వ్యయం అవుతుంది. జూలై 14, 2025 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఇవి పూర్తి నివాస పాఠశాలలు, ఉచిత విద్య, హాస్టల్ వసతిని అందిస్తాయి. గ్రామీణ విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయిస్తారు. ప్రవేశాలు JNVST ద్వారా జరుగుతాయి.
Read Entire Article