తెలంగాణకు చల్లని కబురు.. రెండ్రోజుల పాటు వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ

1 day ago 3
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రేపటికల్లా నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడులను తాకనున్నాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు మండుతుండగా.. సూర్యాపేటలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
Read Entire Article