తెలంగాణ అంతటా హైడ్రాను విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్జంగా హైడ్రాకు వినతులు వస్తున్నాయని.. ఈ నేపథ్యంలో హైడ్రా పరిధిని రాష్ట్రమంతటా విస్తరించాలని నిర్ణయించినట్లు వివరించారు. గురువారం నల్గొండ జిల్లాలో పర్యటించిన హైడ్రా కమిషనర్.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకూ కోట్ల విలువైన భూములను కబ్జాదారుల చెర నుంచి హైడ్రా కాపాడినట్లు వివరించారు.