తెలంగాణలోని స్కూల్ విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త అందించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్టూడెంట్స్‌కు విద్యా కిట్లు అందించనున్నట్లు తెలిపింది. 9 వస్తువులతో విద్యా కిట్లను పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ విద్యా కిట్ల పథకం కోసం రూ.1100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సర్కార్ వెల్లడించింది. ఇక విద్యా కమిషన్ సూచనలతోనే సరికొత్త విద్యా విధానాన్ని తీసుకొస్తున్నట్లు రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు.