Telangana Rythu Bharosa Final Instalment Release Today: తెలంగాణ ప్రభుత్వ రైతులకు పంటల పెట్టుబడి కోసం ఇస్తున్న రైతు భరోసా సాయం తుది విడత నేడు ఖాతాల్లో జమ కానుంది. ఖమ్మం వేదికగా జరిగే రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేస్తారు. మొత్తం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా కింద వారి ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ విడుదల చేయనున్న చివరి విడతగా రూ.1,009 కోట్లు కలిపి మొత్తం రూ.8,759 కోట్ల జమ పూర్తి కానుంది. కొత్తవారికి, సాంకేతిక కారణాలతో ఆగిన వారికి తర్వాత విడుదల చేస్తారు.