తెలంగాణ ప్రభుత్వం ఈనెల 4 నుంచి 9 వరకు నిర్వహించిన రైతు వారోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. సుమారు 2.22 లక్షల మంది రైతులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆధునిక సాగు పద్ధతులు, డ్రోన్ సాంకేతికత, ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించారు. TG Organics యాప్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రారంభించగా.. వానాకాలం సాగుకు ముందస్తుగానే విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్, సన్న వరి సాగుపై శాస్త్రవేత్తలు రైతులకు శిక్షణ ఇచ్చారు.