తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ.. ఖమ్మం జిల్లాలో దేశంలోనే తొలిసారిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ఈ ప్రాజెక్టును ప్రారంభించి మహిళలకు రూ. 10 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేశారు. రాబోయే కాలంలో రూ. 1.30 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని రుణ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు అదానీ, అంబానీల్లా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.