తెలంగాణ ప్రభుత్వం డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 4,021 మంది డయాలసిస్ బాధితులకు నెలకు రూ.2,016 చొప్పున పెన్షన్ మంజూరు చేసింది. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క చొరవతో లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. హెచ్‌ఐవీ బాధితులకు కూడా పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ చర్యలు తెలియజేస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.