తెలంగాణ పర్యాటక రంగానికి సరికొత్త హంగులు.. తొలి దశలో 8 ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్లు

2 hours ago 2
తెలంగాణ రాష్ట్ర నూతన పర్యాటక విధానంలో భాగంగా తొలి దశలో ఎంపిక చేసిన ఎనిమిది ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సమగ్ర మాస్టర్ ప్లాన్లను రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జరిగిన ఉన్నతాధికారులు, ఆర్కిటెక్ట్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రకృతి, ఆధ్యాత్మికత, సాహస క్రీడల కలబోతగా స్లో టూరిజంను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. భువనగిరి, సోమశిల ప్రాంతాలను ప్రధాన పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు.
Read Entire Article