తెలంగాణ కొత్త హైకోర్టు భవనం.. 100 ఎకరాల్లో, 2027 చివరి నాటికి నిర్మాణం పూర్తి

3 months ago 18
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో తెలంగాణ హైకోర్టు జోన్-2 భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. డిసెంబర్ 2027 నాటికి పనులు పూర్తి చేస్తామని ప్రకటించిన సీఎం.. దీనిని దేశంలోనే అతిపెద్ద అత్యాధునిక హైకోర్టు సముదాయంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 100 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ హైకోర్టు భవనంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 49 కోర్టులను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. న్యాయవ్యవస్థను పవిత్ర దేవాలయంగా అభివర్ణిస్తూ.. పేదలందరికీ న్యాయం అందించే దిశగా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.
Read Entire Article