టీటీడీకి మరో భారీ విరాళం అందింది. టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు ముంబై భక్తుడు కోటి రూపాయలు విరాళంగా అందించారు. టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు ముంబైకి చెందిన విజయ్ రమేష్ చంద్ర అనే భక్తుడు కోటి మూడు లక్షల రూపాయలు అందించారు. టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి చేతికి విరాళం డీడీని అందించారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఏఈవో అభినందించారు.