టీటీడీకి మరో భారీ విరాళం అందింది. టీటీడీ BIRRD (Balaji Institute of Surgery, Research & Rehabilitation for the Disabled) ట్రస్ట్‌కు రూ.4.41 కోట్ల విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ విరాళం అందజేసింది. సంస్థ ఛైర్మన్, డైరెక్టర్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. ఈ సందర్భంగా వారిని టీటీడీ ఛైర్మన్ అభినందించారు. ఈ విరాళం.. బర్డ్ ట్రస్టు ఆధ్వర్యంలో వికలాంగులకు అందిస్తున్న వైద్య, పునరావాస సేవలు మరింత విస్తృతంగా కొనసాగేందుకు తోడ్పాటుగా నిలుస్తుందని అన్నారు.