Tirumala Two Brahmotsavams Due To Adhika Masa: తిరుమల శ్రీవారికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. అధిక మాసం కారణంగా సెప్టెంబర్ నెలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ నెలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ నెలలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సంబంధించి టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు అవసరమైన ఏర్పాట్లు చేాయాలని అధికారుల్ని ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సమయంలో వీఐపీ బ్రేక్ సహా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.