Pawan Kalyan Wife Anna Lezhneva Visits Tirumala Temple: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజినోవా తిరుమల శ్రీవారిని సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. శుక్రవారం కాలినడకన తిరుమల చేరుకున్న అన్న లెజినోవా వరాహ స్వామి వారిని దర్శించుకుని తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం దగ్గర ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.