తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మరో అన్నప్రసాద భవనం.. రూ.120 కోట్లతో నిర్మాణం..

4 months ago 23
తిరుమలలో భక్తుల కోసం మరో అన్నప్రసాద భవనం అందుబాటులోకి రానుంది. రిలయన్స్ సంస్థ టీటీడీకి రూ. 120 కోట్లు విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విరాళంతో తిరుమలలో మరో అన్నప్రసాద భవనం, కిచెన్ నిర్మించాలని టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే తిరుమలలో శ్రీవారి ముడుపు పత్రం పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. వకుళామాత ఆలయంలో అక్షర గోవిందం పేరుతో కార్యక్రమం ప్రారంభించనున్నారు. మరోవైపు రూ.5,456.26 కోట్ల బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది.
Read Entire Article