తిరుమల శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు లక్ష మంది భక్తులు.. స్వామివారిని దర్శించుకున్నారు. అయితే తెల్లవారుజామున నిర్వహించే శ్రీవారి అభిషేక సమయంలోనూ భక్తుల క్యూలైన్ అనుమతించడంతో అదనంగా భక్తులకు దర్శన సమయం లభించింది. ఇక ఆ ఒక్కరోజే ఏకంగా 17 గంటలకు పైగా శ్రీవారి దర్శనాలు కొనసాగినట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. భక్తుల రద్దీకి తగ్గట్లు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.