తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు మధ్యవర్తులు, దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి సూచించారు. దర్శనం, వసతి గదుల వివరాల కోసం టీటీడీ అధికారిక వెబ్ సైట్ సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా దళారులు సంప్రదిస్తే టీటీడీ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేయాలని.. దర్శనం, వసతి, సేవల బుకింగ్ విషయాల్లో ఏవైనా సందేహాలు ఉంటే టీటీడీ కాల్ సెంటర్‌ను సంప్రదించాలని ఏఈవో వెంకయ్య చౌదరి సూచించారు.