కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శ్రీవారి ఆలయంలో తొలి హారతిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. డీకే వ్యాఖ్యలపై టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కూడా డీకే శివకుమార్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో తిరుమల నిత్య హారతులలో కర్ణాటకకు ఎందుకు ప్రాధాన్యం.. దీనికి గల కారణాలు ఏమిటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.