యాదగిరిగుట్టను తిరుమల తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు రేవంత్ రెడ్డి సర్కార్ వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా రూ.100 కోట్లతో యాదగిరిగుట్ట అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వేద పాఠశాల, మండపాలు, మెట్ల మార్గానికి పైకప్పు, మాఢవీధులకు మెట్లు వంటి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ క్రమంలోనే మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి.. లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్నారు.