తిరుమల: క్యూలైన్‌లో భక్తుల గొడవ.. సంయమనం పాటించాలని టీటీడీ విజ్ఞప్తి

4 months ago 28
తిరుమల క్యూలైన్‌లో భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కృష్ణతేజ అతిథి గృహం సమీపంలోన క్యూలైన్‌లో భక్తుల మధ్య కొట్లాట జరిగింది. ఇద్దరు భక్తులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనపై టీటీడీ స్పందించింది. భక్తులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఇద్దరు భక్తులు ఘర్షణ పడ్డారని.. టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారని టీటీడీ పేర్కొంది. భక్తులు ఓపికతో వ్యవహరించి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించింది.
Read Entire Article