తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం.. ఇంటి యజమాని తెలివే కాపాడింది.!

3 months ago 24
ఆధ్మాత్మిక నగరం తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ మరోసారి కలకలం రేపింది. రఘునాథరెడ్డి రిసార్ట్స్‌ సమీపంలోని సునందకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో చోరీకి యత్నించింది. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సునందకుమార్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించింది చెడ్డీ గ్యాంగ్. అయితే దొంగల ముఠా కదలికలు గమనించి కుటుంబసభ్యులు కేకలు వేయటంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. సీసీ కెమెరాలో మెుత్తం వ్యవహారం రికార్డైంది. తిరుపతిలోని ఎంఆర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article