Tdp Mla Galla Madhavi Counter To Trolls: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి గత వారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించారు.. అయితే కొద్దిరోజులుగా తనను వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారన గళ్లా మాధవి ఆరోపించారు. శ్రీవారిపై భక్తి భావంతో తలనీలాలు సమర్పిస్తే.. దీన్ని కూడా రాజకీయంగా మార్చేయడం దారుణమన్నారు. మహిళల్ని వైఎస్సార్‌సీపీ అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వారికి మహిళల పట్ల గౌరవం లేదన్నారు.