తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ అధికారం చేజిక్కించుకునే దిశగా దూసుకెళ్తోంది. విజయ్ విజయం వెనుక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాత్ర ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 2023 తెలంగాణ ఎన్నికల్లో స్టాలిన్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి బీఆర్ఎస్‌ను దెబ్బతీశారని.. దానికి ప్రతిగా కేసీఆర్ విజయ్‌కు సహకరించి స్టాలిన్‌కు 'రిటర్న్ గిఫ్ట్' ఇచ్చారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.