Hwaseung Rs 898 Crores Investment In Andhra Pradesh: ఏపీకి పెట్టుబడులు కొనసాగుతున్నాయి.. తమిళనాడును కాదని రాష్ట్రానికి మరో ప్రాజెక్టు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ప్రముఖ ఫుట్‌వేర్ సంస్థ హ్వాసెంగ్ తొలి యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఇది భారత్‌లో ఏర్పాటు చేయబోతున్న తొలి యూనిట్ కావడం విశేషం. రూ.896 కోట్లు పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేస్తారు.. మొత్తం 17,465మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని చెబుతున్నారు.