తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జిగా నల్లమిల్లి మనోజ్ కుమార్ రెడ్డిని టీడీపీ నియమించింది. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరుతో ప్రకటన విడుదలైంది. మరోవైపు నల్లమిల్లి మనోజ్ కుమార్ రెడ్డి తండ్రి.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం బీజేపీ తరుఫున అనపర్తి ఎమ్మెల్యేగా ఉండటం గమనార్హం. ఆ రకంగా తండ్రి బీజేపీ ఎమ్మెల్యే అయితే.. తనయుడు టీడీపీ ఇంఛార్జిగా నియమితులయ్యారు.