ఢిల్లీలో ఎర్రకోట వద్ద బ్లాస్ట్.. హైదరాబాద్‌లో హై అలర్ట్.. సీపీ సజ్జనార్ కీలక ప్రకటన..

8 months ago 18
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడుతో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా.. ఇరవై నాలుగు మంది గాయపడ్డారు. కేంద్ర హోంశాఖ అప్రమత్తమై.. ముంబయి, హైదరాబాద్‌, లక్నో సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌లో సీపీ సజ్జనార్ ఆదేశాల మేరకు రద్దీ ప్రాంతాల్లో నాకాబందీ, వాహనాల తనిఖీలు, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెంచారు. అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తుల గురించి డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Read Entire Article