హైదరాబాద్‌లో మరోసారి మాదకద్రవ్యాల అమ్మకాలు కలకలం రేపాయి. పాతబస్తీలోని మంగళ్‌హాట్ పరిధిలో పోలీసులు జరిపిన మెరుపు తనిఖీల్లో డ్రగ్స్ కొనుగోలు చేస్తూ ఓ ఎమ్మెల్సీ కుమారుడు అడ్డంగా దొరికిపోవడం.. రాష్ట్ర రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పక్కా సమాచారంతో దాడులు చేసిన ఉమ్మడి రక్షక దళాలు.. ప్రజాప్రతినిధి కుమారుడితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం వీరిని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.