ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. 10 రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు ధరలు పెంచారు. అంతర్జాతీయ మార్కెట్లో డీజిల్ ధర పెరిగినప్పటికీ ప్రయాణికులపై భారం వేయకూడదని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతానికి బస్సు ఛార్జీలను పెంచే ఆలోచన లేదని సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి స్పష్టం చేశారు. రోజుకు 6 లక్షల లీటర్ల డీజిల్ వినియోగించే ఆర్టీసీపై ఈ ధరల పెంపు వల్ల రోజుకు రూ. 36 లక్షలు, నెలకు రూ. 10 కోట్లకు పైగా అదనపు ఆర్థిక భారం పడుతోంది. అయినప్పటికీ, సామాన్య ప్రజల ప్రయోజనార్థం ఈ భారాన్ని సంస్థే స్వయంగా భరిస్తూ పాత ఛార్జీలనే కొనసాగిస్తోంది.