డీఎస్సీ 2025పై సీబీఐ విచారణకు జగన్ డిమాండ్.. అధికారంలోకి వచ్చాక విచారణ కమిషన్..

1 month ago 10
YS Jagan Demand CBI Enquiry on DSC 2025: డీఎస్సీ–2025 పై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో పలువురు డీఎస్సీ అభ్యర్థులు వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో చోటు చేసుకున్న అక్రమాలను జగన్‌కు వివరించిన అభ్యర్థులు.. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో వారికి భరోసా ఇచ్చిన వైఎస్ జగన్.. అర్హులైన అభ్యర్థుల తరుఫున వైసీపీ నుంచి న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం లీగల్ ప్యానెల్ ఏర్పాటు చేస్తామన్నారు.
Read Entire Article