ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఎంతటి సంచలనం రేపాయో తెలిసిన సంగతే. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని జనసేన నేతలు కోరటం.. అందుకు అంగీకరిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవటంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే నాగేశ్వర్ వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చిందనే కారణాలను ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.