చంద్రగిరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్లు, రిగ్గింగ్, నామినేషన్ల తిరస్కరణ, బెదిరింపులు జరిగాయని విమర్శించారు. ఆరు జెడ్పీటీసీ స్థానాల్లో మూడు వైసీపీ గెలిచిందని, మిగిలిన మూడు స్థానాల్లో రీపోలింగ్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. తిరుపతి రూరల్‌లో తమ విజయాన్ని భిక్షగా అభివర్ణించడంపై పులివర్తి సుధారెడ్డికి మోహిత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.