ఓ డిప్యూటీ కలెక్టర్ భూ దందాలు, అక్రమ రిజిస్ట్రేషన్ల బాగోతం బయటికి వచ్చింది. ప్రభుత్వ భూములను అక్రమంగా ఇతరుల పేరు మీదికి బదిలీ చేసి.. ఆ తర్వాత మరొకరికి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే విచారణ జరిపిన అధికారులకు ఆ డిప్యూటీ కలెక్టర్ మరిన్ని భూ ఆక్రమణలకు సంబంధించిన వివరాలు తెలిపాయి. దీంతో వెంటనే ఆ డిప్యూటీ కలెక్టర్‌ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి హెచ్చరించారు.