రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను 11 కొత్త అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కోర్సులను ప్రవేశపెట్టినట్లు కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. ఈ మూడేళ్ల కోర్సుల్లో చివరి ఏడాది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ప్రాక్టికల్ శిక్షణ పొందుతూ నెలకు రూ.7 వేల స్టైపెండ్ అందుకుంటారు. ఈ ఏడాది మొత్తం సీట్లను 11 వేలకు పెంచగా.. కనీసం 8 వేల సీట్లను భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. జూన్ 12న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ప్రముఖ పరిశ్రమలతో ఈ మేరకు అవగాహన ఒప్పందాలు జరగనున్నాయి.