హైదరాబాద్- జైపూర్ నగరాల మధ్య ప్రయాణించే వారి కోసం సౌత్ సెంట్రల్ రైల్వే కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును తీసుకొచ్చింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదంతో ఇప్పటివరకు ప్రత్యేక రైలుగా నడుస్తున్న ఈ సర్వీసును జూలై 24 నుంచి రెగ్యులర్ సర్వీసుగా (ట్రైన్ నెంబర్ 17079/ 17080) మార్చనున్నారు. ఈ ట్రైన్ ప్రతి శుక్రవారం హైదరాబాద్‌లో బయలుదేరి ఆదివారం జైపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఆదివారం జైపూర్‌లో బయలుదేరి మంగళవారం హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్‌లో ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.