ట్రాన్స్‌జెండర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డులో కొత్త సభ్యులను నియమించింది. అలాగే ప్రాంతాల వారీగా జిల్లా కలెక్టర్లను ప్రతినిధులుగా నియమించింది. వీటి ద్వారా క్షేత్రస్థాయిలో ట్రాన్స్‌జెండర్ల సమస్యలు, ప్రభుత్వం వారికి అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు మరింత సమర్థవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ.. ఏపీ సర్కారుకు కృతజ్ఞతలు తెలియజేశారు.