తప్పుడు మెడికల్ రిపోర్టులు ఇచ్చినందుకు ఆదిలాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ డాక్టర్లకు రూ. కోటి జరిమానా విధించింది. గర్భవతిగా ఉన్నప్పుడు భాగ్యశ్రీ అనే మహిళకు చేసిన పరీక్షల్లో శిశువు ఆరోగ్యంగా ఉందని వైద్యులు రిపోర్టులు ఇవ్వగా.. శిశువు రెండు కళ్లు లేకుండా జన్మించింది. వైద్యుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు బాధితురాలికి కోటి రూపాయల పరిహారంతో పాటు రూ. 34 వేల కోర్టు ఖర్చులు 12 శాతం వడ్డీ చెల్లించాలని చారిత్రాత్మక తీర్పునిచ్చింది.