ప్రధాని మోదీ పర్యటనపై స్పందించిన మంత్రి కొండా సురేఖ.. బీజేపీ నేతలను విమర్శించే క్రమంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జై శ్రీరాం అంటే పై నుంచి పైసలు పడుతున్నాయా, పథకాలు వస్తున్నాయా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీని తీసుకొచ్చి హిందీలో స్పీ్చ్ ఇప్పించి.. తిరిగి ఢిల్లీకి పంపిస్తారని.. తెలంగాణకు వచ్చే నిధులేమీ ఉండవని ఎద్దేవా చేశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా.. బీజేపీ నేతలు మాట్లాడటం లేదని మండిపడ్డారు.