అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రెండున్నర లక్షల మంది భాగస్వామ్యంతో యోగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. జూన్ ఏడు నుంచి 21వ తేదీ వరకూ ఏపీవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. మరోవైపు వాట్సాప్‌లో హాయ్ అనే మెసేజ్ చేస్తే యోగా వీడియోలు డౌన్ లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు యోగా, నేచురోపతి సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు.