జగిత్యాలలో ఆస్తి వివాదం ముదిరి మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చే ప్రయత్నం చేసే వరకు వెళ్లింది. మృతురాలు మాధురి అత్త ఆస్తిని మనవడికి ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమె బంధువులు మృతదేహంతో ఇంటికి వచ్చి నట్టింట్లో గుంత తవ్వారు. ఈ ఆందోళనతో ఉద్రిక్తత ఏర్పడగా.. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. చివరకు అత్త ఆస్తిని మనవడి పేరిట రాసిచ్చేందుకు ఒప్పుకోవడంతో వివాదం ముగిసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.