జగన్ ఈ కేసు నుంచి బయటపడలేరు.. టీడీపీ నేత ఆనం

1 year ago 25
‘ఇక్కడ సీబీఐ, ఈడీ కేసుల్లా ఏళ్లపాటు అమెరికా కోర్టుల్లోనూ నడిపించొచ్చని మాజీ సీఎం జగన్‌ భావించొచ్చు.. కానీ ఎఫ్‌బీఐ, యూఎస్‌ సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ జ్యూరీ ట్రయల్‌ కోరాయి అన్నారు టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి. నెలల్లోనే విచారణ పూర్తవుతుందని.. ఇందులో ప్రమేయం ఉన్నవారెవరూ తప్పించుకోలేరన్నారు. అమెరికా జ్యూరీ విచారణలో ప్రజల్లోంచి కొంతమందిని ఎంచుకొని వారితో తీర్పు ఇప్పిస్తారన్నారు. అదానీ ముడుపుల వ్యవహారం కేసులో ఎఫ్‌బీఐ, సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ వేసిన ఛార్జిషీటులోని అంశాల్ని ప్రస్తావించారు. ఇందులో 5పేరాలు చదివితే జగన్‌ తన జీవితంలో ఈ కేసు నుంచి బయటపడలేరని అర్థమవుతుందన్నారు. అధిక ధరలకు సౌరవిద్యుత్‌ కొనేలా వివిధ రాష్ట్రాలకు అదానీ సంస్థ ముడుపులు ఇచ్చిన వ్యవహారంలో ఒడిశా కంటే జగన్‌కే ఎక్కువ మొత్తం ముట్టింది అని ఆరోపించారు. గతంలో చంద్రబాబు నాయకత్వాన్ని చూసి చాలా సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. 5 పీపీఏల మీద ఒప్పందాలు జరిగాయని.. కానీ జగన్‌ కక్షగట్టి వాటన్నింటినీ రద్దు చేసుకొన్నారన్నారు.
Read Entire Article