డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియపై ఏపీలో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఈ విషయంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు నారా లోకేష్ సవాల్ విసిరారు. జగన్ ఇంటికి 200 మీటర్ల సమీపంలో నుంచి అడుగుతున్నానని.. దమ్ముంటే డీఎస్సీ మీద చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. తాము వైసీపీలాగా బురద జల్లి పారిపోయే రకం కాదని స్పష్టం చేశారు నారా లోకేష్. అత్యంత పారదర్శకంగా డీఎస్సీ పరీక్షలు నిర్వహించామని తెలిపారు.