జంక్ ఫుడ్‌తో చిన్నారుల ఆరోగ్యానికి ముప్పు.. తెలంగాణలో ప్రతి నలుగురిలో ఒకరికి పోషకాహార లోపం

1 month ago 13
ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 ప్రకారం తెలంగాణలో గత ఐదేళ్లలో చిన్నారుల పౌష్టికాహార ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఐదేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల లోపం 33.1 శాతం నుంచి 27 శాతానికి, తీవ్ర పోషకాహార లోపం 8.5 శాతం నుంచి 3.9 శాతానికి తగ్గింది. అయితే.. ఇప్పటికీ రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారుల్లో జంక్ ఫుడ్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహార అలవాట్లు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
Read Entire Article