హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ బాధితులకు అత్యాధునిక చికిత్సలను అందుబాటులోకి తెస్తోంది. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ సాంకేతికతతో ఇప్పటికే క్యాన్సర్ జీనోమిక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ డైమండ్ ప్రాజెక్టు కింద 1,443 మందికి ఉచితంగా జన్యు పరీక్షలు నిర్వహించారు. దీని ఆధారంగా రోగులకు టార్గెటెడ్ థెరపీ అందిస్తున్నారు. దీనికి అదనంగా.. త్వరలోనే కేవలం రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్‌ను గుర్తించే లిక్విడ్ బయాప్సీ సేవలను ప్రారంభించనున్నారు. ఈ ఖరీదైన పరీక్షలన్నింటినీ ఆరోగ్యశ్రీ పథకం కింద పేద రోగులకు ఉచితంగా అందించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప స్పష్టం చేశారు.