ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 16 వేలకుపైగా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి గత ఏడాది ఏప్రిల్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్ 6 నుంచి జులై 6 వరకు పరీక్షలు నిర్వహించారు. అయితే డీఎస్సీ నియామకాల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని వైసీపీ అధినేత జగన్ ఆరోపిస్తున్నారు. వెంటనే లోకేశ్‌ను మంత్రి పదవి నుంచి తప్పించి, సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.