చంద్రబాబును కలిసిన తెలంగాణ ఎమ్మెల్యే.. స్పెషల్ రిక్వెస్ట్, ఏపీ సీఎం సానుకూలం

1 year ago 25
Achampet Mla Meet Ap CM Chandrababu: తెలంగాణ ఎమ్మెల్యే వంశీకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును శ్రీశైలంలో కలిసి, కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ వంతెన రాయచూరు, కర్ణాటక ప్రాంతాలకు దూరం తగ్గిస్తుందని ఆయన విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం, చంద్రబాబు శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లికార్జున స్వామి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. జూలైలోనే ప్రాజెక్టు నిండటం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
Read Entire Article