సీఎం చంద్రబాబు, టీడీపీ పార్టీని ఉద్దేశించి వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గొడ్డలి పార్టీ, గన్ కల్చర్, హత్యా రాజకీయాలు అంటూ వైసీపీపై చేస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తమ కుటుంబంలో ముగ్గుర్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అని.. చంద్రబాబు అన్న తర్వాత 2, 3 రోజులకే తన తండ్రి వైఎస్సార్.. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని వైఎస్ జగన్ గుర్తు చేశారు.