గ్రామాల్లో ఇళ్ల క్రయవిక్రయాలు.. ఇంటి నెంబర్‌తో రిజిస్ట్రేషన్లు, కీలక ఆదేశాలు జారీ

1 year ago 26
కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీల పరిధిలో ఇంటి నంబరుతో ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అనుమతి లభించింది. అక్రమ రిజిస్ట్రేషన్లను నిరోధించడానికి, పారదర్శకతను పెంచడానికి ఇంటి కొలతలు, విస్తీర్ణం, ఎన్వోసీ వంటి నిబంధనలు తప్పనిసరి చేశారు. ఈ నిర్ణయంతో గ్రామాల్లో క్రయవిక్రయదారులకు ఊరట లభించింది. అయితే, పురపాలికలు, నగరపాలికల్లో, ముఖ్యంగా కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండితో పాటు కొత్తపల్లి, రేకుర్తిలోని 200 సర్వే నంబర్లలో ఇంకా రిజిస్ట్రేషన్లపై స్పష్టత లేకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Entire Article