గోదావరి జిల్లాల ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ ఎక్స్‌ప్రెస్ ఇక నిడదవోలులోనూ ఆగుతుంది..

2 weeks ago 4
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు శుభవార్త. విశాఖ - ముంబయి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇకపై నిడదవోలు రైల్వే స్టేషన్‌లోనూ ఆగనుంది. ఈ మేరకు రైల్వే శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. ఈ నిర్ణయంతో గోదావరి జిల్లాలకు ముంబయితో అనుసంధానం కలుగుతుందన్న పురందేశ్వరి.. విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రధాని, రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.
Read Entire Article